మిస్సింగ్ కేసు చేధించిన మంగళగిరి పోలీసులు
GNTR: మంగళగిరి రూరల్ పరిధిలో భర్తతో విభేదాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళను గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులకు అప్పగించారు. నవులూరుకు చెందిన లక్ష్మీ గత ఏడాది ఆగస్టులో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త రమణబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి, అనకాపల్లిలో ఉన్న ఆమెను కనుగొని, బుధవారం కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.