ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
HYD: ముషీరాబాద్ బాపూజీనగర్‌లో ఓ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఇవాళ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా నాణ్యత లేని పదార్థాలతో కల్తీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేశామన్నారు. కల్తీ పదార్థాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.