నూతన ఎంపీడీవోగా వెంకట్రావు బాధ్యతలు స్వీకరణ
NGKL: కొల్లాపూర్ నూతన ఎంపీడీవోగా వెంకట్రావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తెలియజేయాలని, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే ప్రజలకు అందేలా చూస్తానని పేర్కొన్నారు. కార్యాలయ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలిపారు.