జగిత్యాలలో ఓటరు జాబితా సవరణపై కలెక్టర్ సమీక్ష
JGL: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో బీఎల్‌వోలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా అర్హులైన వారిని జాబితాలో చేర్చాలని, మరణించిన వారు, డూప్లికేట్ పేర్లు తొలగించాలని సూచించారు. దరఖాస్తులను గడువులోగా పరిశీలించాలని తెలిపారు.