అధిక మెజార్టీతో నా భర్తను గెలిపించాలి

ప్రకాశం: సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త అయిన అశోక్ రెడ్డిని అధిక మెజార్టీతో గిద్దలూరు ప్రజలు గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల కోరారు. గిద్దలూరు లోని వెంకటేశ్వర కాలనీలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పుష్పలీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పలీల ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల పైన ప్రజలకు అవగాహన కల్పించారు.