రాచూరులో 'కాఫీ విత్ క్యాడర్'
సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో జిల్లా వైసీపీ అధ్యక్షురాలు పర్యటించారు. 'కాఫీ విత్ క్యాడర్' కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేవని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.