మిర్చికు మద్దతు ధర ఇవ్వాలని ధర్నా: భూక్య వీరభద్రరావు
KMM: మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని ఖమ్మం మిర్చి యార్డు వద్ద ఈ నెల 17న తలపెట్టిన ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం వైరా నియోజకవర్గ కార్యదర్శి భూక్య వీరభద్రరావు అన్నారు. వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో రైతులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మిర్చి క్వింటాకు రూ.25వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.