ట్రాఫిక్ పోలీసులకు సన్ గ్లాసెస్ పంపిణీ
MBNR: ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ డీ.జానకి, IPS ట్రాఫిక్ పోలీసులకు సన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. పోలీసుల ఆరోగ్యం, కళ్ల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. విధి నిర్వహణలో సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.