ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

KDP: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని 'ది పొద్దుటూరు ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్' అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్స్ పాల్గొని తోటి ఫొటోగ్రాఫర్లతో కలిసి కేక్ కట్ చేశారు.