50% సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ

తిరుపతి: 20శాతం ప్రోటీన్ కల్గిన 50కేజీల పశువుల దాణాను ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం సబ్సిడీతో పంపిణీ చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. వడమాలపేట(మం) కల్లూరులో వెటర్నరీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పశువుల దాణాను పాడి రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.