'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
WGL: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతున్నప్పటికీ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి రేడియోగ్రఫీ విభాగంలో అవసరమైన రేడియేషన్ సేఫ్టీ చాంబర్ కూడా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.