వెంకటరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
E.G: రాజమహేంద్రవరం నగర సమాజ సేవకులు, కైలాస భూమి సృష్టికర్త పట్టపగలు వెంకటరావు సతీమణి పట్టపగలు అనంత రామలక్ష్మి మృతి పట్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజా స్ట్రీట్‌లో వారి నివాసానికి వెళ్లి అనంతరామలక్షికి ఘన నివాళులర్పించారు. వెంకటరావుని ఓదార్చి, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.