'మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి'

'మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి'

VZM: రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పైల రమేష్ రాజు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్ణయాలను గౌరవిస్తూ ప్రజాధనం వృథా కాకుండా అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.