కిరాణా దుకాణం దగ్ధం.. రూ.5 లక్షల ఆస్తి నష్టం
VKB: మర్పల్లి మండల కేంద్రంలో లక్ష్మణ్ కిరణ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ ఎర్పడి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకునేలోపు షాపు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. తహసీల్దార్, కలెక్టర్ సిబ్బంది స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. కిరాణా షాప్ యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.