ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించిన అసోసియేషన్ సభ్యులు

ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించిన అసోసియేషన్ సభ్యులు

BDK: మణుగూరు మండల కేంద్రంలో ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహులు లూయిస్ డాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు వన్నం కృష్ణ మోహన్ పాల్గొని మాట్లాడుతూ.. జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఛాయాచిత్రాలను రూపొందించడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.