పోలీస్ శాఖ ఎవరికి తోత్తులుగా వ్యవహరించదు: షకీల్

NZB: పోలీస్ శాఖ ఏ పార్టీకో, ఏ వ్యక్తికో తొత్తుగా వ్యవహరించదని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షకీల్ పాషా స్పష్టం చేశారు. పోలీసులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా చర్యలు తప్పవని శుక్రవారం హెచ్చరించారు.