సీఐటీయూ నేత శ్రీనివాసులు మృతి
ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐటీయూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాసులు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్వీ నాయుడు, ప్రధానకార్యదర్శి ఎస్. నాగేంద్రకుమార్, కోశాధికారి నాగమణి, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.