ముక్కోటి ఏకాదశి గోడ పత్రికలను ఆవిష్కరించిన మంత్రి
గుంటూరు: మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వహించే ముక్కోటి ఏకాదశి గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను మంత్రి లోకేశ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారి సునీల్‌కుమార్ డిసెంబర్ 30న జరిగే ఏకాదశి ఏర్పాట్లను వివరించారు. స్వామివారి దర్శనానికి రావాల్సిందిగా మంత్రికి అధికారుల బృందం ఆహ్వానం అందజేసింది.