VIDEO: అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ
SKLM: నరసన్నపేట పట్టణం జయలక్ష్మి నగర్ -1లో డ్రైనేజీలు అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు అంటున్నారు. డ్రైనేజీల్లో మురుగునీటితోపాటు చెత్తాచెదారం అధికమవడంతో, రోడ్లపైకి ప్రవహిస్తుందని స్థానికులు అంటున్నారు. దీంతో దుర్వాసన అధికంగా వస్తుందని, రాత్రి సమయంలో దోమలు బెడద ఎక్కువగా ఉంటుందని వారు వాపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.