పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళన

HNK: వరంగల్ పబ్లిక్ స్కూల్లో స్లీపర్ గాపనిచేస్తున్న పోలేపాక శ్రీనివాస్(55) సోమవారం స్కూల్లో పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వేంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పాఠశాల ఆవరణలో వుంచి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు విచారణ చేపట్టారు.