హరిబాబు కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి
CTR: పెనుమూరు మండలం మాజీ ఎంపీపీ హరిబాబు నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దంపతులు పరామర్శించారు. ఇటీవల వీరపల్లి గీత మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం ఆమె చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ హరిబాబు నాయుడు టీడీపీ పార్టీకి విశ్వాసపాత్రుడని, ఆ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.