బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు

NLR: బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో పిర్యాదు చేశారు.