కార్తీతో మరో తెలుగు డైరెక్టర్ మూవీ?
తమిళ హీరో కార్తీతో 'మ్యాడ్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరి మధ్య కథ చర్చలు జరుగుతున్నాయట. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కార్తీ.. డిసెంబర్‌లో 'అన్నగారు వస్తారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.