FLASH: ఉప్పల్.. వరంగల్ హైవేపై ట్రాఫిక్ జామ్..!
HYD: ఉప్పల్‌లో వరంగల్ హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ కారణంగా వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యం ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్నారు.