'జిల్లాలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు'

W.G: అరకు ప్రాంతంలో గిరిజనులు సాగు చేసే కాఫీ గింజలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కాఫీ ఘుమఘుమలను అన్ని ప్రాంతాలకు చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసి, తొలి విడతలో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.