బ్రిడ్జికి కొత్త హంగు.. పూర్తవుతున్న రంగులు

బ్రిడ్జికి కొత్త హంగు.. పూర్తవుతున్న రంగులు

కోనసీమ: పి. గన్నవరం కొత్త బ్రిడ్జికి కొత్త హంగు వచ్చింది. సుమారు రూ.49.03 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి మరమ్మత్తు పనులను అధికారులు చేపడుతున్నారు. ఈ మరమ్మత్తు పనులు పూర్తవుతున్న నేపథ్యంలో బ్రిడ్జికి కొత్త రంగులు వేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. గతంలో 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఈ బ్రిడ్జికి రంగులు వేయడం జరిగింది. మళ్లీ ఏప్రిల్ 4వ తేదీకి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.