యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

ATP: బొమ్మనహల్ మండల గోవిందవాడ గ్రామంలో రైతులు యూరియా కోసం గురువారం రైతు సేవ కేంద్రం వద్ద బారులు తీరారు. నిన్న రాత్రి వర్షం కురవడంతో మొక్కజొన్న, మిర్చి, జొన్న, వరి పంటలకు తప్పకుండా ఎరువులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సకాలంలో ఎరువులను అందజేయాలని డిమాండ్ చేశారు.