తుఫాను ఎఫెక్ట్.. నేలకు ఒరిగిన వరి పొలాలు

తుఫాను ఎఫెక్ట్.. నేలకు ఒరిగిన వరి పొలాలు

తూ.గో: తుఫాను కారణంగా మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణం గోకవరం మండలం తంటికొండ, ఇటుకలపల్లి గ్రామంలో వరి పొలాలు నీట మునగాయి. మరి కొన్ని పొలాలు నేలకు వంగడం జరిగింది. దీంతో చేతికి అంది వచ్చిన పంట నేలపాలు కావడంతో ఆ గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పంట నష్టం అంచనా వేసి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.