మాడవీధుల్లో రీల్స్.. చర్యలకు సిద్ధమైన టీటీడీ
AP: తిరుమలలో కొందరు సెలబ్రెటీలు నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తూ వాటిని నెట్టింట ప్రచారం చేయడంపై TTD అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూట్యూబర్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి ఘాట్ రోడ్డులో, ఆలయం ఎదుట రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ స్పందించి.. భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.