‘మోగ్లీ’ టిక్కెట్ రూ.99 మాత్రమే..!!
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ టిక్కెట్ ధర రూ.99కే పెట్టడం ఆ చిత్ర విజయానికి కలిసొచ్చింది. దీంతో మరిన్ని సినిమాలు అదే కోవలో పయనిస్తున్నాయి. తాజాగా రోషన్ కనకాల హీరోగా నటించిన ‘మోగ్లీ’ సినిమాకు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధర రూ.99 మాత్రమే ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మరి ఫలితం కోసం ఈనెల 13 వరకు వెయిట్ చేయాల్సిందే.