నేరాలకు దూరంగా ఉండాలని ఎస్సై హెచ్చరిక
KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో హనుమాపురం, పెద్దకడుబూరు గ్రామాల రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్సై నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టాన్ని గౌరవించి, గతంలో చేసిన నేరాలను పునరావృతం చేయరాదని, కుటుంబ జీవితం సంతోషంగా గడపాలని సూచించారు. నేరాలకు పాల్పడకుండా, సత్ప్రవర్తనతో జీవించాలని పోలీసులు హెచ్చరించారు.