VIDEO: కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన
KMM: కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం SST రోడ్ వద్ద కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన తెలిపారు. గ్యాస్ ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. వారు మాట్లాడుతూ.. దేశ సంపదను అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ, పేద ప్రజలకు అదనపు భారాలు విధిస్తున్నారని మండిపడ్డారు.