VIDEO: అయ్యప్ప స్వామి పంబ అరట్టు ఉత్సవం
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో అయ్యప్ప భక్త మండలి గురుస్వాములతో కలిసి ఆదివారం నిర్వహించిన పంబ అరట్టు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుప్రసాద్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు.