'మాస్ జాతర' వదులుకున్న ఇద్దరు హీరోలు!
మాస్ మహారాజా రవితేజ నటించిన 'మాస్ జాతర' మూవీ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రవితేజ కాదట. మొదట గోపీచంద్, సిద్ధూ జొన్నలగడ్డల దగ్గరకు ఈ మూవీ కథ వెళ్లగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్లు రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలా చివరికి రవితేజ దగ్గరకు వెళ్లిందట. ఇక ఈ చిత్రాన్ని భాను భోగవరపు తెరకెక్కించాడు.