RTC బస్సులో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు
BDK: అశ్వాపురం మండలం రామచంద్రపురం వద్ద మంగళవారం రాత్రి భద్రాచలం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురై హడావుడిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్, బస్సును రోడ్డుపక్కన ఆపాడు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.