యువకుడి అదృశ్యం.. కేసు నమోదు
WGL: గీసుగొండ మండలంలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. మచ్చాపురం గ్రామానికి చెందిన సిద్ధార్థ (23) ఈ నెల 18న కుటుంబంతో జరిగిన గొడవ తర్వాత బుధవారం ఇంటి నుంచి వెళ్లి వెళ్ళిపోయ్యాడు. ఉదయం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, తండ్రి బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.