'తాత్కాలిక ఘాట్ల ఏర్పాటు చేయాలి'
E.G: గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధిపై కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి.నరసింహ కిషోర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోష్పాద నుంచి సుబ్రమణ్య ఘాట్ వరకు అనుసంధానం, కొవ్వూరు నుంచి తాళ్లపూడి వరకు ఘాట్ల అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. భక్తులకు సురక్షిత స్నానాల కోసం సదుపాయాలు, బారికేడింగ్, తాత్కాలిక ఘాట్ల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు.