VIDEO: కోదాడ ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
SRPT: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కోదాడలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి, శివుడికి ప్రత్యేక పూజాలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో జ్యోతులు వెలిగించి, దీపారాధన చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఆలయంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.