VIDEO: మ్యాజిక్ డ్రైన్స్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్స్‌కు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ మ్యాజిక్ డ్రైన్స్ వల్ల గ్రామాల్లో పారిశుద్ధ లోపం తలెత్తదని నీళ్లు ఎప్పటికప్పుడు భూములో ఇంకిపోతాయని తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు సైతం రీఛార్జ్ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.