బీ.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు
NLG: రాజ్యంగా నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నాగార్జునసాగర్ హిల్ కాలనీలో MLA కుందూరు జయవీర్, ఎమ్మెల్యే BLR అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.