గుమ్మడిదలలో 13.1° ఉష్ణోగ్రత నమోదు

గుమ్మడిదలలో 13.1° ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 11.1 డిగ్రీలు, గుమ్మడిదలలో 13.1 డిగ్రీలు, అమీన్‌పూర్‌లో 11.7° డిగ్రీలు, రామచంద్రాపురంలో 12.4 డిగ్రీలు, పటాన్ చెరులో 09.0° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 84.4% గా నమోదయింది. ఉదయం వేళలో పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.