ఇల్లు కూలి నిద్రలోనే కుటుంబం మృతి

ఇల్లు కూలి నిద్రలోనే కుటుంబం మృతి

NDL: నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరిమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్థులు వెలికితీస్తున్నారు.