రేపు నేలకొండపల్లిలో ఉచిత వైద్య శిబిరం

రేపు నేలకొండపల్లిలో ఉచిత వైద్య శిబిరం

KMM: నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఉదయం 9:30 గంటల నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గీత తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, కంటి, పళ్లు, ఎముకలు, గైనకాలజీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు.