పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు

పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు

ASF: ఆసిఫాబాద్ కొమ్ముగూడకి బోయిని వెంకటేశ్(32) మిస్ అయినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 19న వెంకటేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబీకులు బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. వెంకటేశ్ తండ్రి శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తేలిపారు.