నోబెల్‌కు నాకంటే అర్హుడు లేడు: ట్రంప్
నోబెల్ శాంతి బహుమతికి తనకంటే అర్హులు ఎవరూ లేరంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మాజీ అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ ఎందుకు వచ్చిందో.. బహుశా అది ఆయనకు కూడా తెలియదేమోనని ఎద్దేవా చేశారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా తాను 8 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. తనలాగా మరెవరూ యుద్ధాలను ఆపలేకపోయారని వెల్లడించారు.