రైతులకు యూరియా కొరత లేదు: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేదని తెలిపారు. అవసరమైన మేరకు సరఫరా జరుగుతోందని చెప్పారు. వ్యవసాయేతర అవసరాలకు వాడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 4,700 టన్నుల యూరియా నిల్వలో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.