కొత్త చట్టాలపై ప్రయాణికులకు అవగాహన

కొత్త చట్టాలపై ప్రయాణికులకు అవగాహన

విజయనగరం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు కొత్త చట్టాలపై జీఆర్పీ ఎస్సై బాలాజీరావు, ఆర్పీఫ్‌తో కలసి బుధవారం అవగాహన కల్పించారు. రైళ్లలో ప్రయాణం చేసినపుడు, విశ్రాంతి తీసుకున్నప్పుడు అత్యవసర సమయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ 139కు ఫోన్ చేయాలని కోరారు. రైలు ఎక్కినపుడు, దిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విలువైన వస్తువులతో ప్రయాణం చేయకూడదన్నారు.