మంత్రికి, ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

మంత్రికి, ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

AP: విశాఖ జిల్లా కృష్ణాపురంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. MSME పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో సభావేదిక కూలిపోయింది. నేతలు సభావేదిక నుంచి దిగుతుండగా కిందపడిపోయారు. వెంటనే పక్కనున్నవారు వారిని పైకి లేపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వలేదు.