VIDEO: స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకున్న శక్తి టీమ్
ELR: నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఓ స్టూడెంట్ ఈవ్ టీజింగ్ చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు శక్తి టీమ్ వెంటనే స్పందించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ నిమిత్తం 3-టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళల భద్రత కోసం నిరంతరం పహారా కాస్తున్న ఈ బృందానికి ప్రజలు అభినందనలు తెలిపారు.