VIDEO: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

VIDEO: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు మహబూబ్‌నగర్ రేంజ్ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, తనిఖీలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.